VISION & MISSION OF GASB...

VISION OF “గ్రామ అభివృద్ధి సంఘం భట్టువారిపల్లె”:
                                     సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న అన్ని వర్గాల వారికి రక్షణ కవచంలాంటి ఫ్రేరణ కలిగిన విధి విధాన కార్యక్రమాలనుిస్వార్ధంతో శక్తివంతంగా అభివృద్ధి పధంలోకి నడిపించటం.
తేది: 01.08.2014
లక్ష్యాలు:
1)    సామాన్య మానవుని ప్రయోజనాల కోసం జాతీయ ,అంతర్జాతీయ సాంకేతిక , సమాచారాన్ని పెంపొందించటం .
2)    సమాజానికి సేవ చేయుటకు ఫ్రేరణ కల్గిన చురుకైన వ్యక్తులను సంస్థలో పెంచటం
3)    సమాజానికి పరోపకారం చెయ్యటానికి అంకితమైన యువతకి సమాచార వ్యవస్థని పెంపొందించుకొని  విస్తరింపచేయుట
4)    ప్రభుత్వ పథకాలను అమలు చేసుకోవటానికి పరిసర ప్రజలకు  సహాయకారిగా ఉండుట
5)    బాల కార్మికులకు విముక్తి కలిగించటం , వృద్ధాప్యులకు , వికలాంగులకు  చేయూత నివ్వటం , నిరుద్యోగుల స్వయంపోషకాలకి సహాయకారిగా ఉండుట ,పేదవారికి ఉపశమన కలిగించుట .
నమూనా విశేషాలు :
1)    ప్రభుత్వ మరియు ప్రైవేటు పథకాల ద్వారా  పేదవారికి  ఉపశాంతి కోసం సహాయ కారిగా ఉండటం
2)    విజ్ఞానం, దూరదృష్టి, నైపుణ్యం, వనరులు పట్ల మూలాధార సమాచార సామర్ధ్యం కలిగి స్వచంద సంస్థలు ద్వారా శక్తి మేర అభివృద్ధి చేయ గలిగే పనులనుూడటం.
3)     అక్షరాస్యత , నివాసం , రక్షణ పట్ల  హక్కులు ,ప్రయోజనాలు కోల్పోయిన ఆట్టడుగు ప్రజలను రాజ్యంగ పరంగా సమాజం లో అభివృద్ధి పధంలోకి తీసుకరావటం .
4)    పరిశుభ్రత ,మత్తు పానీయాలను వినుయోగించుట , హెచ్ . . వి  / ఎయిడ్స్  లాంటి ప్రమాదకరమైన రోగాలు , అంటువ్యాధులు పట్ల నిర్లక్ష్యం పై అవగాహన కలిపించుట
5)    కులాలు ,మతాలు ,ప్రాంతాలు ,లింగ వివక్ష ,జాతులు పట్ల ఉన్న వివేకం పై అవగాహన కలిపించుట
6)    ఆటలు ,యువత కార్యక్రమాలు పెంపొందించుట
7)    ప్రకృతి వైపరీత్యాలతో ఆపదలు కలిగిన వాళ్ళ కోసం ఉపశమన ఆర్ధిక సహాయం కలిగించుట.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • Twitter
  • RSS

15-08-2014 INDIPENDENCE DAY...

గ్రామ అభివృద్ధి సంఘం -భట్టువారిపల్లె  తేది: 15.08..2014
                       గ్రామ అభివృద్ధి సంఘం సభ్యులకు ,గ్రామం నుంచి అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ వ్యాపారస్తులకు ,గ్రామ ప్రజలకు ,గ్రామ పెద్దలకు ,విద్యార్ధులకు నా హృదయ పూర్వక అభినందనలు మరియు నమస్కారములు .
                             మన గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన గ్రామ అభివృద్ధి సంఘంఆధ్వర్యంలో 68 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలని మన గ్రామం లో 15.08.2014 జరుపుకున్నాము . కార్యక్రమం లో పాల్గొని ,వారి అభిప్రాయ సూచనలని తెలియ జేసి మన గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మన గ్రామ ప్రజలకి ,ఉద్యోగ , వ్యాపారస్తులకి ,గ్రామ పెద్దలకి ,కొంతమంది ప్రముఖులకు ఆహ్వానం తెలియపరిచినాము. 15.08.2014 రోజున జరిగే కార్యక్రమాల ఎజెండాను ముందుగానే సభ్యుల అందరికి తెలియ పరిచినాము .                                               
క్రింద తెలియజేసిన గౌరవనీయులు అందరు వేడుకలకు హాజరయ్యారు.
Ø  మన గ్రామ అభివృద్ధి సంఘం సభ్యులైన గాదె శివరామకృష్ణ , కోరముట్ల లక్ష్మీనారాయణ ,ఆతుకూరి శ్రీనివాసరావు ,ఆతుకూరి నాగేశ్వరరావు , కోరముట్ల జనార్ధన్ రావు ,కోరముట్ల పూర్ణ చందర్ రావు ,బండారు దివ్య గిరి ,నలమార అరుణ్ బాబు , జక్కా ప్రసాద్ రావు ,పయ్యావుల శ్రీ హరి ,పయ్యావుల శంకర్ ,వెలిశెట్టి పరబ్రంహం (స్నేహ సైంటిఫిక్ ) ,నూకన సైదయ్య ,వెలిశెట్టి శ్రీ హరి , వెలిశెట్టి అశోక్,వెలిశెట్టి శ్రీనివాసరావు ,ప్రత్తి శ్రీను ,కోలిశెట్టి మల్లికార్జునరావు ,ముండ్లపూటి  శ్రీనివాసరావు , కూరపాటి అనంత రాజు ,కూరపాటి రామ రాజు ,సుందర్ రాజు, బొల్లేపల్లి శివ రాజు,చింతకాయల ఆంజనేయులు ,చింతకాయల రమేష్ , వెలిశెట్టి పూర్ణయ్య ,ఆది శ్రీనివాసరావు ,మేడతి బజారు ,మేడతి శ్రీనివాసరావు ,తలిశెట్టి  శ్రీను ,రమణ ,గాదె అప్పారావు ,పయ్యావుల శ్రీనివాసులు రావు మరియు
Ø  గ్రామ ప్రజలైన  చింతకాయల ఆది నారాయణ (సర్పంచ్),కోరముట్ల పేద అంకయ్య (మాజీ ఉప సర్పంచ్ ),కోరముట్ల చిన అంకయ్య(మాజీ సర్పంచ్) , పులిమి పెద సైదులు (మాజీ సర్పంచ్ ), చింతకాయల ధనలక్ష్మి(మాజీ సర్పంచ్ ),గాదె లక్ష్మి నరసింహారావు (రిటైర్డ్ స్కూల్ మాస్టర్ ),పులిమి నర్సయ్య , పయ్యావుల సోమయ్య ,పొన్నపూల సాంబయ్య ,నలమార అనంతలక్ష్మయ్య , వెలిశెట్టి బ్రంహం ,నలబోతుల శ్రీనివాసరావు,నందం వెంకటేశ్వర్లు ,నందం బూచి ,వేలిశెట్టి పేరయ్య,పులిమి దర్గ, పొన్నపూల రాఘవలు ,తోట నరసింహారావు ,పయ్యావుల నాగేశ్వరరావు ,నీలం నరసింహయ్య ,కూరపాటి కృష్ణం రాజు ,చింతకాయల శ్రీనివాసరావు ,పంపనూటి చిన బజార్ ,రావుల గోవిందు ,నలమార మంగపతి ,రావుల పెద అంకరావు ,రావుల బాపిని ,వంగర కోటేశ్వర రావు, బాబు సాహెబ్ ,గుమ్మ ఆంజనేయులు.
Ø  స్వాతంత్ర్య దినోత్సవ  వేడులని మన గ్రామ స్కూల్  హెడ్ మాస్టర్ కోటయ్య గారు ,టీచర్స్ ,ముఖ్య అతిదులైన  శ్రీ చింతకాయల ఆది నారాయణ (సర్పంచ్ ) గారిచే జెండా పతాకం ఆవిష్కరించారు .
Ø  మన గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన గ్రామ అభివృద్ధి సంఘం యొక్క లక్ష్య సాధనలో భాగంగా గ్రంధాలయం ను  karempudi (mandal) ZPTC సభ్యులు శ్రీ  వలప బాల స్వామి , MPP అధ్యక్షులు  శ్రీ నాగుల నాయక్ , MPP (VICE ) పంగులూరి పుల్లయ్య గారిచే ఆవిష్కరణ జరిగింది .
Ø   గాదె నరసింహారావు మాస్టర్ గారు ,చింతకాయల ఆది నారాయణ గారు , స్కూల్ హెడ్ మాస్టర్ కోటయ్య గారు ,కోరముట్ల చిన అంకయ్య గారు స్వాతంత్ర్య ఆవశ్యకతను, అమర వీరుల గురించి చాల మంచిగా వివరించారు.
Ø   మన గ్రామ నుంచి గురజాలకు వెళ్ళే లింకు రోడ్డుకు నిధులు మంజూరు అవ్వటానికి ZPTC గ్రాంటు కింద నిధుల మంజూరుకు కృషి చేస్తానని  ZPTC సభ్యులు శ్రీ  వలప బాల స్వామి గారు హామీ ఇచ్చారు.
Ø  స్కూల్ కాంపౌండ్ వాల్ కు స్కూల్ అభివృద్ధికి నిధుల మంజూరుకు కృషి చేస్తానని MPP అధ్యక్షులు శ్రీ నాగుల నాయక్ గారు ,MPP (వైస్) శ్రీ పంగులూరి పుల్లయ్య గారు హామీ ఇచ్చారు.
Ø  గ్రామ అభివృద్ధి సంఘం కార్యక్రమాలను ,లక్ష్యాల గురించి స్ఫూర్తి పొందానని ఇలాంటి కార్యక్రమాలు మన గుంటూరు జిల్లాలో ప్రతి గ్రామంలో జరిగేటట్టు నేను కూడా ప్రయత్నం చేస్తానని  ట్రస్ట్ గురించి  చాల గొప్పగా  శ్రీ  వలప బాల స్వామి గారు కొనియాడారు.
Ø  శ్రీ కూరపాటి అనంత రాజు S/O సైదం రాజు గారు (మన ఊరి RMP డాక్టర్) మణుగూరు లో డిప్యూటీ తహసీల్దార్ గా పని చేస్తున్నారు .వారు మన ఊరి అభివృద్ధి కోసం ఎంతో ఉత్సాహం తో  వచ్చి మనకు చాల ధైర్యాన్ని నింపారు .ప్రభుత్వ పధకాల గురించి కావలసిన పూర్తి సమాచారం అందించటం తో పాటు ,మన మండల MRO గారితో స్వయంగా మాట్లాడి మన ఊరి అభివృద్ధి కోసం కావలసిన సహకారాన్ని మనకు అందేవరకు నేను కూడా భాగాస్వామినవుతానని చెప్పారు.
Ø  మొదటిగా ఫిల్టర్ వాటర్-(RO Process )ను ఏర్పాటు చెయ్యటం  ,స్మశాన వాటికను ఆదునీకరించటాన్నివేడుకలకి హాజరైన ట్రస్ట్ సభ్యులంతా కలసి నిర్ణయం తీసుకున్నాము .ప్రభుత్వ పధకాల నుంచి వచ్చే సహాయాన్ని పరిగణలోకి తీసుకొని రెండు కార్య క్రమాలను ప్రారంభించటం జరుగుతుంది . రెండు ప్రాజెక్ట్స్ కు ఖర్చు అంచన వేసి అందరి ఆమోద తీసుకోవటం జరుగుతుంది .
Ø  గ్రామ అభివృద్ధి సంఘం ని రిజిస్టర్ చెయ్యటం , గ్రామ అభివృద్ధి సంఘం  పేరుపై బ్యాంకు ఎకౌంటు తియ్యటం కొన్ని అనివార్య కారణాల వల్ల చెయ్యలేక పోయాము. రిజిస్ట్రేషన్ జరగబోయ తేదిని మీఅందరికి తెలియపరుస్తాము.
Ø  వేడుకల కార్యక్రమం విజయం అవ్వటానికి తోడ్పాటును అందించిన శ్రీ కోరముట్ల పెద అంకయ్య (మాజీ వైస్ సర్పంచ్) గారికి గ్రామ అభివృద్ధి సంఘం  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నది.

Ø  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కార్యక్రమంతో మన గ్రామ ప్రజలలో ,యువకులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
మన భట్టువారిపల్లె ను దేశంలోనే ఆదర్శ వంతంగా తీర్చిదిద్ధాలంటే  మనం ఎంతో కృషి చెయ్యవలచిన అవసరం ఉంది  .
గ్రామ అభివృద్ధి సంఘం యొక్క లక్ష్యాలు :
1)      ఆదర్శ వంతమైన ఐక్యత మన గ్రామ ప్రజలలో వచ్చేవిధంగా మనం కృషి చెయ్యాలి .(కక్షలు, కార్పణ్యాలు వదిలి, ప్రజల స్వయం పరిపాలన, ఉమ్మడి నిర్వహణ వంటి వినూత్న విధానాల తో  నిరంతర శ్రమ, గ్రామ సామాజిక అభివృద్ధిని సాధించటం.)
2)       ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతో వివిధ రకాల సంఘ నిర్మాణ కమిటీలు ఏర్పాటు చెయ్యాలి.
(a)    గ్రామ పంచాయతీ కమిటీ : గ్రామ పంచాయతి సమావేశాలకు అధ్యక్షత ,గ్రామ పంచాయతి నిర్ణయాల అమలు,గ్రామాభివృద్ధి అధికారి నుండి కావలసిన సమాచారం సేకరణ,సభ్యుల అనర్హతను,ఖాళీలను జిల్లా పరిషత్ అధికారులకు తెలియచేయుట,సంవత్సర ఆదాయ వ్యయాల లెక్కలు ,వచ్చేకాలానికి చేపట్టే పనులు వివరాలు ,పన్నుల మార్పుల ప్రతిపాదనలు ,కొత్త కార్యక్రమాల లబ్ధి దారుల ఎంపిక.
(b)   మంచినీటి నిర్వహణ కమిటీ :ఇంటింటికీ నీటి సరఫరా, కుళాయిల చుట్టూ పారిశుధ్యం ,స్వచంద సంస్థల సాయంతో ఫ్లోరైడ్ రహిత నీటి ప్రాజెక్టు రూపొందించుట .2 రూపాయలకే 20 లీటర్లు నీరు అందించుట
(c)    విద్యా కమిటీ : పాఠశాల నిర్వహణ, మరమ్మతులు వగైరా.
(d)   డిష్ కమిటీ : కేబుల్ కనెక్షన్ పని, నిరంతరాయంగా కేబుల్ ప్రసారాలు , నెలసరి చార్జీలు లేకుండా ఒకసారి చెల్లిస్తే మొత్తాన్ని బ్యాంకులో జమ చేసి వచ్చే వడ్డీ తో డిష్ నిర్వహణ.
(e)   ఆరోగ్య కమిటీ : గ్రామంలో ఆరోగ్య అవగాహన కల్పించడం, విషజ్వరాలు, వాంతులు, విరేచనాలు లాంటి సీజనల్వ్యాధులకు వెంటనే ప్రాథమిక వైద్య సహాయం అందించటం .అవసరాన్ని బట్టి హెల్త్సెంటర్కు పంపించటం , గ్రామంలో ఆరోగ్య శిబిరాల ఏర్పాటుకు కృషి చెయ్యటం.
(f)     మధ్యపాన నిషేధ కమిటీ : గ్రామంలో మధ్యం వినియోగం లేకుండా చెయ్యటం.
(g)    అమ్మ కమిటీ : అంగన్ వాడీకి అనుబంధంగా - గర్భిణీ, బాలింతల అవసరాలను చూచుట .
(h)   రికవరీ కమిటీ : వ్యవసాయ ఋణాలను బ్యాంకులకు సక్రమంగా చెల్లించే పని అజమాయిషీ.
(i)      గ్రామాభివృద్ధి కమిటీ : అన్ని అభివృద్ధి కార్యక్రమాలు .
(j)     పౌర సరఫరాల కమిటీ : గ్రామంలో ప్రజలందరికీ చౌక డిపో ద్వారా అన్ని సరుకులూ అందేలా చూడటం.
(k)    వీధిలైట్ల నిర్వహణ కమిటీ : గ్రామంలో వీధిలైట్ల నిర్వహణపై ప్రతి రాత్రి తనిఖీలు చేసి ,ఎక్కడైనా లైట్లు వెలుగడంలేదని గుర్తిస్తే మరునాడే సరి చెయ్యటం.
(l)      పారిశుద్ధ్య కమిటీ : రోడ్లు ,మురుకి నీటి కాలువలు  శుభ్రం చేయించుట
(m) ప్లాస్టిక్నివారణ కమిటీ : ప్రతి ఇంటి ఆవరణలో ఉన్న ప్లాస్టిక్ను సేకరించుట .
(n)   మహిళా సమస్యల పరిష్కార కమిటీ : గ్రామంలో మహిళల సమస్యలను పరిష్కరించుట.
(o)   అమ్మ హస్తం కమిటి: మహిళలు ప్రతిరోజు వంట చేసే సమయంలో గుప్పెడు బియ్యం తీసి ఒకచోట పోసి అన్ని ఇళ్లలోని బియ్యాన్ని నెలకు ఒక్కసారి అమ్మగా వచ్చిన డబ్బులు మానసిక వికలాంగులైన పిల్లలకు సహాయంగా అందచేయుట .
(p)   వృత్తిదారుల సమన్వయ కమిటీ: వృత్తి దారులకు లభించే రుణాల పట్ల అవగాహన కలిపించుట,వారి సమస్యలకు పరిష్కార మార్గాలు ఎంచుట .
(q)   అంతర్గత ఆడిట్కమిటీ : గ్రామంలో ఉన్న అన్ని కమిటీల యొక్క లక్ష్యాలను ,పనితీరు పారదర్స్యకతను పరిశీలించుట ,లోపాలను గుర్తించి , స్టాండర్డ్ బట్టి ర్యాంక్ ఇచ్చుట .
(r)     ఆధ్యాత్మిక అభివృద్ధి కమిటీ: ఆధ్యాత్మిక కార్యక్రమాలు ,పండుగలు,దేవాలయాల పరిరక్షణ.
(s)    గ్రామ నిధి కమిటీ : గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు రోజుకు ఒక రూపాయి చొప్పున  గ్రామాభివృద్ధికి ఇచ్చే నిధిని సేకరించుట .గ్రామం లో కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు ఖాహిధ రుసుమును నిర్ణహించి వ్యాపారస్తుని నుంచి సేకరించుట . నిధిని గ్రామం పేరుమీద ఉన్న బ్యాంకులో జమ చేయుట .
(t)     గ్రంధాలయ కమిటీ : గ్రంధాలయ నిర్వహణ ,ఆధునిక అభివృద్ధి.
                మన గ్రామ అభివృద్ధి మూడు   విషయాలమీద ఆధారపడి ఉంది .1) ప్రజల అందరిలో గ్రామాభివృద్ధి చైతన్యం , 2) మా ఊరి ప్రజలు అంతా నా కుటుంబం సభ్యులు అనే భావన ప్రతి ఒక్కరికి కలగటం 3) గ్రామ ఆర్ధిక వనరులు .మన గ్రామం లో మూడు విషయాలను సాధించాలంటే  ఎంతో పట్టుదల ,కృషి ,సహనం ,సమయస్పూర్తి కావాలి . గ్రామ అభివృద్ధి సంఘం మన గ్రామ అభివృద్ధికి తల్లి లాంటిది అని మనమందరం భావించాలి గౌరవించాలి ,మన ముందున్న సవాళ్ళను ఎదురుకోవటానికి మనమంతా తల్లి బిడ్డలం కావాలి.
              ఒక  కుటుంబానికి   గొప్పగా పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంటె కుటుంబ సబ్యులు అంత ఏకతాటి గా ఉండి గ్రామంతో  పోటి పడాలి  .ఒక  గ్రామానికి   గొప్పగా పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంటె గ్రామ ప్రజలు  అంత ఏకతాటి గా ఉండి మండలంతో  పోటి పడాలి.ఒక  మండలానికి   వారి జిల్లాలో  గొప్పగా పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంటె మండలం  ప్రజలు  అంత ఏకతాటి గా ఉండి జిల్లాతో   పోటి పడాలి. రోజున ఎక్కువ శాతం ప్రజలు తన గొప్పతనం అనే పరిధిని విస్తరించుకోవటం కాకుండా కుసించుకొనిపోయే పరిస్తితులలో ఉన్నారు .కనీసం మన మండలం లో మన గ్రామానికి ఒక గుర్తింపు రావాలనే కోరిక కలిపించుకుంటే  మన గ్రామ ప్రజలలో ఉమ్మడి చైతన్యం వస్తుంది.మా ఊరు నా కుటుంబం అనుకుంటే అన్ని మనస్పర్ధలు సర్దుకుంటాయి . ఉమ్మడి చైతన్యం ఒక్కరో పదిమందో చెప్పటం వల్ల రాదు కనుక మనమందరం కలసి మన గ్రామ ప్రజలతో మాట్లాడాలి.
                ప్రజలను అభివృద్ధి నిర్మాణ కమిటీలో సంపూర్ణ భాగస్వామ్యులను చెయ్యటంవారి వారి సమర్ధత ,పరిజ్ఞానం,ఉత్సాహం బట్టి ప్రజలతో కమిటీల ఏర్పాటు చెయ్యటం అభివృద్ధికి మొదటి మెట్టు లాంటిది .పైన తెలిపిన కమిటీలలో మనం భాగస్వాములం అయ్యి మన కుటుంభ సబ్యులను భాగస్వామ్యులను చెయ్యవలచిన భాద్యత మనపై ఉన్నది. మీకు నచ్చిన కమిటీలో ఉండటానికి మీరు నిర్ణయం తీసుకొని చారిటి ట్రస్ట్ కి తెలియజేస్తారని ఆచిస్తున్నాము .మన గ్రామాభివృద్ధికి మీ ఆలోచన తెలియ జేసి , ఉన్నతమైన కార్యాచరణకు నిర్ణయం తీసుకుంటారని ఆచిస్తున్నాము . గ్రామ అభివృద్ధి సంఘం గురించి మీ ఆలోచనలను , ఉన్నత విమర్శలను గాదె శివరామకృష్ణ (9440088217),కోరముట్ల లక్ష్మినారాయణ (9247105377) గార్లకు తెలియజేయగలరు .

కొన్ని అనివార్య కార్యాల వల్ల మన వేడుకల విశేషాలను తెలియజేయటం లో జాప్యం జరిగినందుకు చింతిస్తున్నాను.
ఇట్లు మీ
పయ్యావుల శ్రీనివాసులు రావు, భట్టువారిపల్లె , Contact No: 9849848586

          



  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • Twitter
  • RSS