26-01-2015 GUNTUR PROGRAMME...
గ్రామ అభివృద్ధి సంఘం -భట్టువారిపల్లె ( రిజిస్టర్ నెంబర్ : 407 / 2014 )
ప్రియమైన గ్రామ అభివృద్ధి సంఘం సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు ధన్యవాదములు ,
మన మిత్రుడు ఆతుకూరి నాగేశ్వరరావు గారి ఆఫీసు (చంద్ర మౌళి నగర్ ,3 వ లైన్,భాష్యం స్కూల్ లైన్ -గుంటూరు ) లో మన గ్రామం అభివృద్ధి కోసం 26.01.2015 వ తేదిన మీటింగ్ జరపటం జరిగింది .
ఈ కార్యక్రమానికి హాజరైన వారి వివరములు ఈ క్రింద తెలపబడినవి.
1)శ్రీ కంబాల రాజేంద్రప్రసాద్ గారు ,2) శ్రీ చీతిరాల అంక రావు గారు,3) శ్రీ చీతిరాల చిన అంక రావు గారు ,4) డాక్టర్ శ్రీ కూరపాటి మని రాజు గారు 5) డాక్టర్ శ్రీ కొలిసేట్టి పేద రామ లింగం గారు 6) శ్రీ కూరపాటి రామ రాజు గారు 7) శ్రీ కోరముట్ల జనార్ధన్ గారు 8) శ్రీ సరికొండ బజార్ రాజు గారు 9) శ్రీ నీలం నాగేశ్వరావు గారు ,10) శ్రీ గాదె శివరామ కృష్ణ గారు ,11) శ్రీ నలబోతుల లింగయ్య గారు 12) శ్రీ నీలం మంగరావు గారు ,13) శ్రీ పయ్యావుల శ్రీనివాసులు రావు గారు ,14) శ్రీ పులిమి బాలసైదులు గారు15) శ్రీ ఆతుకూరి శ్రీనివాసరావు గారు ,16) శ్రీ ఆది శ్రీనివాసరావు గారు ,17) శ్రీ పప్పూరి సుబ్బారావు గారు ,18) శ్రీ ఆతుకూరి నాగేశ్వరరావు గారు ,19) శ్రీ పయ్యావుల రామకృష్ణ గారు,20) శ్రీ ఆతుకూరి సతీష్ గారు ,21) శ్రీ ఆది శ్రీధర్ గారు,22) శ్రీ హరిదాసు సాంబ శివరావు గారు ,23) శ్రీ నీలం వేణుగోపాల్ రావు గారు ,24) శ్రీ పోలేపల్లి రాంబాబు గారు 25) శ్రీ కోరముట్ల పూర్ణ చంద్ర రావు గారు ,26) శ్రీ సరికొండ సందర్ రాజు గారు ,27) నీలం అంక రావు గారు ,28) శ్రీ గాదె అప్పారావు గారు ,29) శ్రీ పయ్యావుల పాపారావు గారు ,30) శ్రీ రావుల అంక రావు గారు ,31) శ్రీ గేనిపిసేట్టి మని కంట్ట గారు ,32) శ్రీ కూరపాటి ఆంజనేయ రాజు ,33) శ్రీ పయ్యావుల మహేష్ గారు ,34) శ్రీ కూరపాటి శ్రీనివాసరాజు గారు ,35) S.K .ఖాసిం గారు.
ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యుల యొక్క సలహాలు మరియు సూచనలను ఈ క్రింద తెలియజేస్తున్నాము
• కంబాల రాజేంద్ర ప్రసాద్ గారు : మన గ్రామ అభివృద్ధి సంఘం యొక్క ప్రణాళిక పనులను నిర్వర్తించే వ్యక్తులు గ్రామంలో ఉండాలని ,ఉత్సాహవతులైన వారిని ఎంపిక చేయమని సలహా ఇచ్చారు .తన వంతు మన గ్రామానికి కావలసిన సహాయ సహకారాలు తప్పకుండ అందజేస్తానని హామీ ఇచ్చారు .: గ్రామానికి అత్యవసరమైన చిన్నపాటి పనులను త్వరగా పూర్తి జేసి,ప్రజలకు మన సంఘం పట్ల విశ్వాసాన్ని పెంచుదామన్నారు .
• చీతిరాల అంకారావు గారు : ఉద్యోగ ,వ్యాపారస్తుల సహృదయంతో గ్రామ అభివృద్ధి సంఘం ఏర్పడినందుకు హర్షం వ్యక్తం చేసారు .ఎన్ని ఆశయాలు ,లక్ష్యాలు గురించి మాట్లాడుకున్నా ,అభివృద్ధికి కావాల్సిన నిధులు లేకుండా ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు .కావున ప్రతి ఒక్కరు కూడా తమకు తోసిన సహాయం అందించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు .
• చీతిరాల చిన అంకారావు గారు : మన గ్రామానికి సంభందించిన రహదారిని R&B లో చేర్చటానికి ఏర్పడ్డ జాప్యం మరియు ఆటంకాలు గురించి ప్రభుత్వ మరియు రాజకీయ నాయకుల తో మాట్లాడతానని అన్నారు . పేద విద్యార్ధులకు కల్పించే మరియు ప్రోత్సకాలకు తన వంతు కూడా ఆర్ధిక సహాయం అందిస్తాని అన్నారు . ప్రభుత్వం నుంచి మరుగు దొడ్లు నిర్మాణం కోసం ఇచ్చే నిధులను మన ఊరిలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని , మరుగు దొడ్లుకు కావలసిన ముడి సరుకు ఇసుక ,సిమెంట్ మరియు ఇనుము ...వంటి వాటిని అందరు కలసి ఒకే చోట నుంచి తెప్పించుకుంటే తక్కువ ఖర్చులో నిర్మించు కోవచ్చని అన్నారు. ఈ విషయంలో పూర్తి సమాచారాన్ని అందజేస్తాని అన్నారు.
• డాక్టర్ కూరపాటి మని రాజు గారు : గ్రామ అభివృద్ధి సంఘం ఏర్పాటుతో మనమంతా ఇక్కడ కలసి మన గ్రామ అభివృద్ధి గురించి మాట్లాడుకోవటం చాల ఆనందంగా ఉందని ,ఈ రోజున అమెరికా అద్యక్షుడు శ్రీ బరాక్ ఒబామా గారు మన దేశాన్ని సందర్శించటం లో ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యతతో మన గ్రామం అభివృద్ధి కోసం అందరు ముందుకు వచ్చినదుకు దన్యవాదములు తెలుపుతున్నాని అన్నారు . మన గ్రామం లో మంచి నీటి (ఫిల్టర్ వాటర్ ) సౌకర్యం ఏర్పాటు చేస్తునందుకు హర్షం వ్యక్తం చేసారు .ప్రతి సంవత్సరం తన వంతు సహాయాన్నిమన గ్రామానికి అందజేస్తానని అన్నారు.
• డాక్టర్ కోలిశెట్టి పేద రామలింగం గారు : మన గ్రామానికి సంభందించిన అన్ని ప్రభుత్వ పధకాలను పూర్తి స్తాయిలో సద్వినియోగిన్చుకోవాలని అన్నారు .గ్రామాభివ్రుద్ధికోసం చేసే ప్రణాళిక పనులకు శ్రమ దానం చేసేవిధంగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి ,వినియోగించుకోవాలని అన్నారు. విద్యాబ్యాసం పూర్తి చేసిన విద్యార్ధుల పుస్తకాలను సేకరించి గ్రందాలయం లో బద్ర పరచాలని అన్నారు . మన గ్రామ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు .
• కూరపాటి రామ రాజు గారు : గ్రామానికి చెందిన రోడ్డును R&B లో చేర్చే ప్రయత్నం మరియు గ్రామ ప్రజలకు మంచి నీటి (ఫ్లిటర్ వాటర్ )సౌకర్యం కల్పించటం చాలామంచి నిర్ణయం అని , ప్రాంతీయ మరియు జాతీయ (లోక సభ ,రాజ్య సభ )ఎలక్షన్స్ లో గ్రామ ప్రజలంతా కలసి ఉన్నతమైన వ్యక్తిని ఎంచుకొని ,డబ్బుకు ఓటును అమ్ముకోకుండా నిజాయితిగా ఓటు హక్కును వినియోగించుకునేవిధంగా మన మంత ప్రయత్నం చేద్దాం అని అన్నారు.
• కోరముట్ల జనార్ధనరావు గారు : మన గ్రామం లో ఉన్న ప్రజల ఆలోచన విధానాలను గమనిస్తే , ఎప్పటికి కూడా అభివృద్ధి నోచుకోదేమోనని భాదపదేవాడినని అన్నారు .కాని ఈ కార్యక్రమాలు మరియు గ్రామ అభివృద్ధి సంఘం యొక్క లక్ష్యాలను చూస్తుంటే త్వరలో మన గ్రామం అత్యంత ఉన్నతమైన గ్రామం గా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం కలిగింది .మన గ్రామ అభివృద్ధి కోసం చేసే అన్ని కార్యక్రమాలలో తప్పకుండ పాల్గొంటానని అన్నారు.
• గాదె శివ రామ కృష్ణ గారు : భట్టువారిపల్లె గ్రామం కు అభివృద్ధి అంటే ఏమిటో కూడా తెలియదని చాలామంది అనుకోవటం తనకు బాధ కలిగించిందని ,గ్రామం అభివృద్ధి చెందాలని ఎప్పుడు కోరుకుంటూ ఉండేవాడినని అన్నారు . ఉద్యోగ ,వ్యాపారస్తులం అందరం కలసి గ్రామ అభివృద్ధి కోసం తోడ్పాటు అందిద్దామని అన్నప్పుడు నేను చాల సంతోషం పడ్డానని ,గ్రామం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం కూడా ఏర్పడిందని అన్నారు .మన గ్రామం అభివృద్ధి చెందటానికి "గ్రామ అభివృద్ధి సంఘం" ఒక బలమైన పునాది లాంటిదని ,మన మంత ఆదర్శ వంతమైన గ్రామ నిర్మాణం లో పాలు పంచుకోవాలని అన్నారు .
• పయ్యావుల శ్రీనివాసులు రావు గారు : గ్రామ అభివృద్ధి అంటే గ్రామ ప్రజలంతా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ,సాంకేతిక పరిజ్ఞానం ను అందిపుచ్చుకునేవిధంగా మన గ్రామ ప్రజలు ఆర్దికంగా ఎదగాలని .ఉన్నతమైన విద్యావంతులు , ఆర్ధికవేత్తలు ,శాస్త్రవేత్తలు ,సమాజాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించే నాయకులు , ఉన్నతమైన (కలెక్టర్ ,పోలీస్ ,డాక్టర్స్ ,లాయర్స్ ...) ప్రభుత్వ పదవులను నిర్వర్తించే వ్యక్తులకు మన గ్రామం పుట్టినిల్లు కావాలని , గ్రామానికి కావాల్సిన సౌకర్యాలను గ్రామ ప్రజలంతా కలసి సమిష్టి కృషితో ఏర్పాటు చేసుకోవాలి అలాగే ప్రభుత్వ మరియు స్వచ్చంద పధకాలను పూర్తి స్తాయిలో వినియోగించుకోవాలి అనే విషయాలను వివరించారు.
• పులిమి బాల సైదులు గారు : మన గ్రామ అభివృద్ధి ని నేను నా బాద్యత గా భావించి కృషి చేస్తానని అన్నారు .
• పప్పూరి సుబ్బారావు గారు : మన గ్రామం మనకు పుట్టినిల్లు లాంటిది .ఏ దేసమేగిన, ఎందుకాలిడిన. ఏ పీథమెక్కిన, ఎవ్వరేమనిన. పొగడరా! నీ తల్లి భూమి భారతిని. నిలుపరా! నీ జాతి నిండు గౌరవము. అన్నట్లుగా మన గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరానికి తన సంపాదనలో కొంత మొత్తాన్ని మరియు తమ ఖర్చుల్లో కొంత పొదుపు చేసి సహాయం అందించాలని అన్నారు .గ్రామ అభివృద్ధి సంఘం కోసం ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేసినామని,ఆ వెబ్ సైట్ (www.bhattuvaripalli2015.blogspot.in) లోకి వెళ్లి అందరు తమకు నచ్చిన సలహాలు సూచనలను ,విషయాలను పంచుకోవచ్చని అన్నారు.
• గాదె అప్పారావు గారు : మన గ్రామం లో ఉన్న దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ,గ్రామ ప్రజలంతా సమిష్టి భాగ స్వామ్యంలోకి వస్తున్నారని హర్షం వ్యక్తం చేసారు .
• నీలం అంకారావు గారు : నిజామాబాద్ జిల్లాలోని ఒక గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఉన్నతమైన ఉద్యోగి ఉన్నారని ,అలాగే మన గ్రామం కూడా అభివృద్ధి చెందాలని అన్నారు .
• పయ్యావుల పాపారావు గారు: మన గ్రామంలో ప్రతి వీధిలో అక్కడక్కడ చిన్న చిన్న మంచినీటి ట్యాంకులు నిర్మించి ,కులాయిలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు .
• రావుల అంకారావు గారు : గ్రామంలో పారిశుధ్యం ,వీధి లైట్స్ ,బస్సు సౌకర్యం ఏర్పాటు కోసం ప్రాముఖ్యత ఇవ్వాలని ,అలాగే చెత్తను సేకరించటానికి ఒక చిన్న వెహికల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు .
• సరికొండ బజార్ రాజు గారు : విద్యార్ధుల భవిష్యత్ కోసం మనం ఎక్కువ కృషి చేయాలని అన్నారు .
• గేనిపిసేట్టి మని గారు : మన గ్రామ దేవుడైన " బొడ్డురాయి" హీన స్తితిలో ఉందని వివరించారు .బొడ్డురాయి పునః నిర్మాణం కోసం త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు .
• కూరపాటి ఆంజనేయ రాజు గారు: మన గ్రామం అభివృద్ధిని నోచుకోకపోవటానికి గ్రామంలో ఉన్న ప్రజల యొక్క సమిష్టి లోపమని అన్నారు .విద్యార్ధుల పట్ల మనం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని అన్నారు .
• ఈ సభకు వచ్చిన మిత్రులందరూ చాల సంతోషం వ్యక్త పరిచారు. అందరిలో ఒక బలమైన ఆత్మా విశ్వాసం కలిగింది .
• గ్రామ అభివృద్ధి సంఘం పేరు మీద తెరిచిన బ్యాంకు ఎకౌంటు వివరాలు ఈ క్రింద తెలియ జేస్తున్నాము .
• ACCOUNT HOLDER NAME : GRAMA ABHIVRUDHI SANGHAM –BHATTUVARIPALLE ,
• STATE BANK OF INDIA AD BRANCH KAREMPUDI,ACCOUNT NUMBER : 34551356730, IFSC CODE :SBIN0002741 .
అందరి సలహాలను సూచనలను పరిగణలోకి తీసుకొని ,ఉన్నతమైన నిర్ణయాలతో ప్రణాళిక పనులను వేగవంతం చేస్తామని గ్రామ అభివృద్ధి సంఘం హామీ ఇస్తున్నది .
ఈ కార్యక్రమం విజయవంతముగా జరగటానికి కృషి చేసిన శ్రీ ఆతుకూరి నాగేశ్వరరావు గారు , శ్రీ కూరపాటి రామరాజు గారు , శ్రీ పులిమి బాల సైదులు గారు గ్రామ అభివృద్ధి సంఘం లో కేంద్ర సభ్యులుగా ఉన్నందుకు గ్రామ అభివృద్ధి సంఘం హర్షం వ్యక్తం చేస్తున్నది. తమ విలువైన సమయాన్ని మన గ్రామ అభివృద్ధి కోసం కేటాయించి ,సభకు వచ్చి తమ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియపరిచిన ప్రతి ఒక్కరికి దన్యవాదములు తెలుపుతూ ....గ్రామ అభివృద్ధి సంఘం -భట్టువారిపల్లె.
Read Users' Comments (0)