04-01-2015 HYD PROGRAMME...
గ్రామ అభివృద్ధి సంఘం -భట్టువారిపల్లె తేది :04.01.2015
ప్రియమైన మరియు గౌరవ గ్రామ అభివృద్ధి సంఘం(భట్టువారిపల్లె) సభ్యులకు అభినందనలు మరియు నమస్కారములు ,
2015 సంవత్సరం సంక్రాంతి పండుగ దినాలలో 13
నుంచి 15 తేదిలలో మన గ్రామ ప్రజలలో గ్రామ అభివృద్ధి పట్ల ఒక అవగాహన సదస్సు
కార్యక్రమం ఏర్పాటు చెయ్యటానికి,
హైదరాబాద్ లో ఉన్నటువంటి మన గ్రామ
అభివృద్ధి సంఘం సభ్యులంతా కలసి ప్రణాళిక
ప్రకారం 04.01.2015 తేదిన శ్రీ వెలిశెట్టి పరబ్రంహం H .No : 2-103/9,గంగారం,చందానగర్ ,హైదరాబాద్-50 యందు సమావేశం ఏర్పాటు చెయ్యటం జరిగింది .
సమావేశంలో పాల్గొన్న సభ్యుల సలహాలు / సూచనలను ఈ క్రింద తెలియపరుస్తున్నాము .
1)
పయ్యావుల శ్రీనివాసులు రావు : మా ఊరే మా ఇల్లు, మా ఊరంతా ఒక ఉమ్మడి కుటుంబం అని ప్రతి ఒక్కరు భావించటం వల్ల మనందరిలో ఐఖ్యత పెరిగి అన్ని విధాల అభివృద్ధి చెందుతామని అన్నారు . కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వాములను చెయ్యటం ద్వారా ప్రణాళిక పనులను వేగవంత చేయగలుగుతామని అన్నారు. మన గ్రామానికి సేవ చేసి అభివృద్ధి చెందిన్చాలనే తపన ,ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ చాల ఎక్కువగా ఉందని కొనియాడారు .
2)
కోరముట్ల లక్ష్మీనారాయణ : గ్రామ అభివృద్ధి సంఘం స్తాపించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలను( స్వాతంత్య దినోత్సవ వేడులకుల విషయాలు , గ్రంధాలయం ప్రారంభోత్సవం గురించి , సంఘం ను ప్రభుత్వ అధికారిక రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన విషయాలు మరియు సంఘం పేరు మీద బ్యాంకులో తెరిచిన ఎకౌంటు వివరాలు గురించి) తెలియ జేశారు .ఇలాగే అందరూ కూడా చాల ఉత్సాహంగా ముందుకు వస్తే మనం అనుకున్న పనులను త్వరగా పూర్తి చెయ్యగలమని అన్నారు .
3)
గాదె శివ రామకృష్ణ : ప్రణాళిక కేలండర్ తయారు చేయటం ,సభ్యులందరినీ ఉత్సాహంగా పాల్గోనేటట్టు చేయటం ,ఆర్ధిక సహాయం చేయలేని వాళ్ళను వాలంటీర్లుగా తీసుకొని కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గోనేటట్టు చెయ్యటం మరియు సంఘం లో ఫండ్ ను పెంచటం ,వచ్చిన ఫండ్ ను సరైన విధంగా ఖర్చు చేయాలని చెప్పారు .
4)
వెలిశెట్టి పరబ్రంహం : గ్రామానికి అత్యవసరమైన చిన్నపాటి పనులను త్వరగా పూర్తి జేసి,ప్రజలకు మన సంఘం పట్ల విశ్వాసాన్ని పెంచుదామన్నారు .
5)
నలమార మధు :సంఘానికి వచ్చిన ఫండ్స్ దుర్వినియోగం చేస్తే , దానివల్ల మనం ఎంత అభివృద్ధిని కోల్పోతాము అనే విషయాలను ముందుగానే ఒక అవగాహన అందరికి తెలియజేయాలని అన్నారు . మన గ్రామంలోని పంచాయితి భవనానికి చెందిన బోర్ మోటార్ ని మరమత్తులు చేసి ,నిరుపయోగంగా ఉన్నవాటర్ ట్యాంక్ ను వినుయోగించుకి ప్రతి ఇంటికి నీరు సరఫరా అయ్యేటట్టు చెయ్యాలని అన్నారు
6)
నలమార నవీన్ : మన గ్రామానికి లింక్ రోడ్లు ఆదునీకరించితె (కోడమగుండ్ల ,గాదెవారిపల్లె ,గోగోలపాడు ,గురజాల నుంచి ) , గ్రామంలో పంట ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులు పెరిగి వ్యాపారపరంగా మన ఊరు అభివృద్ధి చెందుతుందని అన్నారు.
7)
పప్పూరి సుబ్బారావు : మన గ్రామం నుంచి హైదరాబాద్ కు వచ్చిన నిరుద్యోగులకు ,వైద్యం నిమిత్త వచ్చిన గ్రామ ప్రజలకు ఒక షెల్టర్ ఏర్పాటు చేసి వారికి కావలసిన సమాచారం , తోడ్పాటు అందిద్దాం అన్నారు . మన నిత్య జీవితం లో చేసే ఖర్చుల్లో కొంత పొదుపు చేసి ,మన సంఘానికి విరాళంగా ఇద్దాం అని అన్నారు .
8)
పప్పూరి సంజీవరావు : ప్రతి ఒక్కరు ఒక రోజుకు ఒక రూపాయి మన గ్రామానికి విరాళంగా ఇవ్వాలనే కాన్సెప్ట్ మరియు ప్రతి ఒక్కరి అమ్మ వంటచేసే సమయం లో ఒక గుప్పెడు బియ్యం తీసి మన సంఘానికి విరాళంగా ఇవ్వాలనే కాన్సెప్ట్ చాల బాగున్నాయి అన్నారు .ఈ రెండు కాన్సెప్ట్స్ విజయవంతంయ్యేవిధంగా మనం గట్టి ప్రయత్నం చేద్దామన్నారు .
9)
చింతకాయల వీర ఆంజనేయులు : సంఘం లో ఉన్న సభ్యులందరికీ ఒకరి పై ఒకరికి నమ్మకం ఏర్పడే విధంగా మనమందరం సత్సంభందాలు పెంచుకోవాలని అన్నారు .
10) చింతకాయల రమేష్ : మన గ్రామంలోని పంచాయితి భవనానికి చెందిన బోర్ మోటార్ ని మరమత్తులు చేసి ,నిరుపయోగంగా ఉన్నవాటర్ ట్యాంక్ ను వినుయోగించుకొని ప్రతి ఇంటికి నీరు సరఫరా అయ్యేటట్టు చెయ్యాలని అన్నారు . ఒక మారు మూల గ్రామం (పచ్చిమ గోదావరి జిల్లా , చేగూరు గ్రామం ) ఏ విధంగా అభివృద్ధి చెందింది ,అలా అభివృద్ధి చెందటానికి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఏమి పాటించారు అనే విషయాలను ఒక డాక్యుమెంటరీగా చిత్రీకరించిన వీడియో ను సమావేశం లో ప్రదర్చించారు.
11) జక్క ప్రసాద్ : గ్రామ అభివృద్ధి సంఘానికి కావాల్సిన ఫండ్స్ ను సేకరించటానికి మన సమయాన్ని కొంత కేటాయించాలని అన్నారు .అందరి సలహాలు ,సూచనలను గ్రామ అభివృద్ధి సంఘం తమ పరిగణలోకి తీసుకోవాలని అలాగే గ్రామ అభివృద్ధి సంఘం తీసుకున్న నిర్ణయాలకు సభ్యులందరు కట్టుబడి ఉండాలని అన్నారు.
12) బొల్లేపల్లి భారతి : మన గ్రామంలో ఉన్న ప్రజల మధ్య సత్సంబంధాలు పెరిగేటట్టు మంచి మంచి కార్యక్రమాలు చెయ్యాలని అన్నారు .
13) బొల్లేపల్లి ఆంజనేయ రాజు : మన గ్రామ లో ఉన్న వీధి లైట్స్ కు సోలార్ పవర్ కల్పించాలని మరియు మన గ్రామం లో ఉన్న ప్రతి ఇంటికి సోలార్ పవర్ అందించటం వల్ల అదనపు ఆదాయం రావటానికి వీలుకలుగుతుందన్నారు.
14) వెలిశెట్టి బ్రంహం : గ్రామ అభివృద్ధి సంఘం యొక్క ప్రణాళిక కార్యక్రమాలలోని ఒక పనిని త్వరగా పూర్తి చేద్దాం అన్నారు .
15) రావుల నరసింహారావు : గ్రామ అభివృద్ధి సంఘం యొక్క ప్రణాళిక కార్యక్రమాలలో ఒక పని పూర్తి చెయ్యటం వల్ల ప్రజలలో నమ్మకం ఏర్పడుతుందని అన్నారు అలాగే గ్రామ అభివృద్ధి సంఘం యొక్క కార్యక్రమాలకు సంభందించిన సంవత్సర క్యాలెండరు తయారు చేస్తే బాగుంటుందని అన్నారు.
16) ముండ్లపూడి సత్యనారాయణ : మన గ్రామంలోని పంచాయితి భవనానికి చెందిన బోర్ మోటార్ ని మరమత్తులు చేసి ,నిరుపయోగంగా ఉన్నవాటర్ ట్యాంక్ ను వినుయోగించుకొని ప్రతి ఇంటికి నీరు సరఫరా అయ్యేటట్టు చెయ్యాలని అన్నారు.
17) మేడతి లక్ష్మణ్ : ప్రణాళిక పనులలో జాప్యం జరగకుండా చూసుకోవాలని సంఘానికి చూసించారు .
18) పగడాల అప్పారావు : గ్రామ అభివృద్ధి సంఘం యొక్క ప్రణాళిక కార్యక్రమాలు వేగవంతం అవ్వటానికి కావాల్సిన నిధులను సమ కూర్చుకోవాలని అన్నారు.
19) వెలిశెట్టి రవితేజ : ఈ కార్యక్రమం నన్ను ఎంతగానో స్ఫూర్తిని అందిన్చిదన్నారు.నేను ప్రతి కార్యక్రమం లో నా వంతు కృషి చేస్తానని అన్నారు.
20) వెలిశెట్టి సాయి భార్గవ్ : ఈ కార్యక్రమం నన్ను ఎంతగానో స్ఫూర్తిని అందిన్చిదన్నారు.నేను ప్రతి కార్యక్రమం లో నా వంతు కృషి చేస్తానని అన్నారు .
గ్రామ అభివృద్ధి సంఘం యొక్క ప్రణాళిక పనులను చెయ్యటానికి కావలసిన ఫండ్స్ కోసం కొంతమంది దాతలు ముందుకు వచ్చారు .వారి వివరాలు ఈ క్రింద తెలియపరుస్తున్నాము .
1)
శ్రీ పయ్యావుల శ్రీనివాసులు రావు గారు ప్రతి సంవత్సరానికి 12000 రూపాయల విరాళం అందజేయనున్నారు .
2)
శ్రీ కోరముట్ల లక్ష్మీనారాయణ గారు ప్రతి సంవత్సరానికి 12000 రూపాయల విరాళం అందజేయనున్నారు.
3)
శ్రీ వెలి శెట్టి పరబ్రంహం గారు ప్రతి సంవత్సరానికి 12000 రూపాయల విరాళం అందజేయనున్నారు .
4)
శ్రీ పప్పూరి సుబ్బారావు గారు ప్రతి సంవత్సరానికి 6000 రూపాయల విరాళం అందజేయనున్నారు.
5)
శ్రీ పప్పూరి సంజీవరావు గారు ప్రతి సంవత్సరానికి 6000 రూపాయల విరాళం అందజేయనున్నారు .
6)
శ్రీ జక్క ప్రసాద్ రావు గారు ప్రతి సంవత్సరానికి 5000 రూపాయల విరాళం అందజేయనున్నారు.
7)
శ్రీ పగడాల అప్పారావు గారు ప్రతి సంవత్సరానికి 5000 రూపాయల విరాళం అందజేయనున్నారు.
8)
శ్రీ వెలిశెట్టి బ్రంహం గారు 2000 రూపాయలు ఇచ్చారు .
గ్రామ అభివృద్ధి సంఘం పేరు మీద తెరిచిన బ్యాంకు ఎకౌంటు వివరాలు ఈ క్రింద తెలియ జేస్తున్నాము .
ACCOUNT HOLDER NAME : GRAMA ABHIVRUDHI SANGHAM –BHATTUVARIPALLE ,
STATE BANK OF INDIA AD BRANCH KAREMPUDI,ACCOUNT NUMBER :
34551356730, IFSC CODE :SBIN0002741 .
మన గ్రామ అభివృద్ధి కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించి, సమావేశానికి వచ్చి సలహాలు మరియు సూచనలు తెలియపరిసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము .ఈ సమావేశానికి ఒక వేదికగా వారి ఇంట్లో ఏర్పాటు చేసి ,సభకు వచ్చిన సభ్యులందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసిన శ్రీ వెలి శెట్టి పరబ్రంహం గారికి ప్రత్యెక కృతజ్ఞతలు తెలియ పరుస్తున్నాము .
గోలి వాస్తవ్యులు శ్రీ పగడాల అంజమ్మ గారి కుమారుడు శ్రీ పగడాల అప్పారావు గారు తన మేనమామ (శ్రీ జక్కా అప్పయ్య గారు) గారి ఊరి పట్ల ఉన్న ప్రేమతో , మన గ్రామ అభివృద్ధి సంఘం పట్ల స్ఫూర్తి నొంది ప్రతి సంవత్సరం 5000 రూపాయలను విరాళంగా ప్రకటించినందుకు ,వారికి గ్రామ అభివృద్ధి సంఘం ప్రత్యెక కృతజ్ఞతలు తెలియజేస్తున్నది .
సంక్రాంతి దినాలలో మన గ్రామ ప్రజలకు కోసం గ్రామ అభివృద్ధి అవగాహన సదస్సును ఏర్పాటు చేయటానికి ఈ సభకు వచ్చిన సభ్యులందరు అందరు అంగీకరించారు .భట్టువారిపల్లె గ్రామంలో జరిగే కార్యక్రమాల వివరాలు ఈ క్రింద తెలియజేస్తున్నాము .
1) స్వచ్చ భారత్ ప్రోగ్రాం :14.01.2015 వ తేదిన ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 01:00 వరకు.
2) సంక్రాంతి ముగ్గుల పోటీలు :14.01.2015 వ తేదిన సాయంత్రం 03:00 నుంచి సాయంత్రం 05:00 వరకు.
3) గ్రామ అభివృద్ధి అవగాహన సదస్సు :15.01.2015 వ తేదిన ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 01:00 వరకు.
మీ అందరి సహాయ సహకారముల తోటి ఒక సుందరమైన
ఆదర్శ గ్రామాన్ని నిర్మించుకోవటానికి ఈ కార్యక్రమాలలో పాల్గొని మీ అమూల్యమైన
సలహాలు ,సూచనలు తెలియజేస్తారని ఆశిస్తూ సగౌరవంగా మీకు ఆహ్వానం తెలుపుతున్నాము .
ధన్యవాదములతో
గ్రామ అభివృద్ధి సంఘం -భట్టువారిపల్లె ,కారెంపూడి మండలం ,గుంటూరు జిల్లా -522614.
Read Users' Comments (0)