30-05-2014 BODDU RAYI...

           భట్టువారిపల్లె గ్రామం ,కారంపూడి మండలం ,గుంటూరు జిల్లా -522614  . తేది.30.05.2014
              మన గ్రామం మధ్యలో కులమతాలకు అతీతంగా వేలిచిన  దేవుడే బొడ్డు రాయి .బొడ్డు రాయి దేవుడికి చాల విశిష్టత ఉంది .గ్రామ బొడ్డు రాయి కి ప్రతి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వర్తిస్తే గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందనే నమ్మకం పురాతన కాలం నుంచి ప్రజలలో ఉంది . నమ్మకం అన్ని ప్రాంతాలలో ఉంది .
         మన ఊరిలో(భట్టువారిపల్లె ) ఉన్న బొడ్డు రాయి దేవుడు కి  చాల అరుదుగా పూజలు జరుగు చున్నవి .బొడ్డు రాయి దేవుడు చుట్టూ చెత్త ,చెదారంతో పేరుకు పోయింది . కుక్కలు మల మూత్రాలు అక్కడే విసర్జిస్తున్నాయి.బొడ్డు రాయి దేవుడు  కూడా రోడ్డు సమతలానికి క్రింద బాగంలో ఉంది .బొడ్డు రాయి చుట్టూ ఎలాంటి గ్రిల్స్ కూడా లేవు.గ్రామ ప్రజలు పాత కాలం నాటి మనస్పర్ధలతో ,రాజకీయ విభేదాలతో మన గ్రామ బొడ్డు రాయి దేవుడి పట్ల  అశ్రద్ధ చూపిస్తున్నారు . కొంత మంది  గ్రామ ప్రజలు బొడ్డు రాయి దేవుడి పట్ల ఉన్న హీన పరిస్థిని జీర్ణించుకోలేక పోతున్నారు. మన గ్రామ ప్రజలు విషయాన్ని గ్రామ అభివృద్ధి సంఘం (భట్టువారిపల్లె) కి తెలియ చేసినారు . మన  ట్రస్ట్ సభ్యులు చాల మంది విషయం గురించి  శ్రద్ధ పెట్టినారు .మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలలో బొడ్డురాయి దేవుడు కి ప్రధమ స్థానం కలిపించాలని గ్రామ ప్రజలు మరియు గ్రామ అభివృద్ధి సంఘం సభ్యులు కోరినారు .బొడ్డు రాయి దేవుడు పునః నిర్మాణానికి అయ్యే ఖర్చును అంచన వేసి ,ఎప్పుడు ప్రారంభించటం అనే విషయాలను  త్వరలో తెలియ చేస్తామని మన గ్రామ ప్రజలు మన గ్రామ అభివృద్ధి సంఘం లోని  కొంతమంది సభ్యులతో చెప్పటం జరిగింది .
మన ఊరి బొడ్డు రాయి దేవుడు ని ఫోటోలు తీసి మన గ్రామ అభివృద్ధి సంఘం సభ్యులకు పంపిద్దామని గాదె శివరామ కృష్ణ మేడతి బజార్ తో చెప్పినారు .చెప్పిన వెంటనే మేడతి బజార్ 29.05.2014 తేది నాడు ఫోటోలు తీసినాడు .
మన ఊరిలోని బొడ్డు రాయి దేవుడు కి 29.05.2014 తేది నాడు తవిటి శ్రీనివాసరావు గారు పూజలు నిర్వహించి నారు.పూజలు చెయ్యక ముందు మరియు పూజలు చేసిన తరువాత మన ఊరి బొడ్డు రాయి దేవుడు పరిస్తితి  ఎలా  ఉందో ఫోటో రూపంలో తెలియ చేస్తున్నాము.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • Twitter
  • RSS

0 Response to "30-05-2014 BODDU RAYI..."

Post a Comment