OUR ACTIVITIES & GOALS...

  భట్టువారిపల్లె గ్రామం ,కారంపూడి మండలం ,గుంటూరు జిల్లా -522614
                           మన భట్టువారిపల్లె గ్రామ నుంచి దూర ప్రాంతాలలో ఉద్యోగులుగా,వ్యాపారస్తులుగా స్తిరపడిన మరియు అభివృద్ధి చెందిన మిత్రులకు ,గౌరవనీయులకు నా హృదయపూర్వక శుభాభినందనలు మరియు నమస్కారములు.
                               గత 30  సంవత్సరములుగా మన గ్రామం ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేదు.ఇప్పటికి మన ఊరిలో మంచి నీటి సౌకర్యం లేదు ,సరైన రవాణా సౌకర్యం లేదు, బస్ లేదు ,వీధి రోడ్లు అభివృద్ధి చెందలేదు ,గ్రంధాలయం లేదు, మురుగు నీటి కాలువలు ఆధునీకరణ  చెందలేదు ,వీధి దీపాలు అంతనతమాత్రానే వెలుగు చున్నాయి. చదువుకునే పిల్లల్లో చైతన్యం పూర్తి స్తాయిలో లేదు .చదువుకోవాలనే కోరిక ఉండి పేదరీకంతో చదువుకోలేక చాల మంది నిరక్షరాసులుగా ఉండి అభివృధి చెంధలేక పోతున్నారు . నూతన వ్యవసాయ పద్ధతుల గురించి తెలియని వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు .మన ఊరిలో ఇప్పటికి భాహిర్భూమికి వెళ్ళే అలవాటు నుంచి మార్పు చెందని వాళ్ళు చాల మంది ఉన్నారు .ఊరు అపరిశుభ్రంగా ఉండటం వల్ల ,పారిశుధ్యం పట్ల అవగాహన లేక పోవటం వల్ల అనేక రోగాలను ఇంట్లో తెచ్చి  పెట్టుకొంట్టున్నాము . మన ఊరిలో ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు కూడా చాల తక్కువ మంది మాత్రమే ఉన్నారు .చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చేసేవాళ్ళు చాల మంది ఉన్నారు.ఉద్యోగ అవకాశాల గురించి గైడెన్స్ తీసుకోలేక పోవటం ,గైడెన్స్ ఇచ్చేవాల్లతో సరైన సంబంధాలు లేక పోవటం వల్ల అనుకున్న ఉద్యోగ అవకాశాలు త్వరగా పొందలేక పోతున్నారు .అవకాశ మార్గాలు ఉండి ఉపయోగించుకోలేక పోతున్నారు .
                                         ఇప్పటికి దేశంలో ఎక్కడ చూసిన కులాలకు , మతాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చుకుంటూ తోటి మానవుడి పట్ల అజ్ఞానంగా  ప్రవర్తిస్తూ మంచిని పెంచుకోలేక పోవటం వల్ల అభివృద్ధిని అడ్డుకొంటూ  అన్యాయానికి ,అవినీతికి జీవం పోస్తూ మనవ జాతికే కాకుండా సర్వ ప్రాణికి నష్టం ,కష్టం కలగటానికి కారణం అవుతున్న వాళ్ళు చాల మంది ఉన్నారు .ఈ సమాజాన్ని కాపాడగలిగే ,అభివృద్ధి చెందిన్చాగలిగే శక్తీ విద్యావంతులలో ,మేధావులలో ఉంది . మంచి పనిలో ఒకరికి ఒకరు తోడు , ఎవరికి వారు సత్ప్రవర్తన కలిగితే మనం ఎవరిని మార్చాల్సిన పని లేదు. సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి  మానవడు తన జీవితానికి అనుకూలంగా  ప్రవర్తన కలిగి ఉంటున్నాడు .
                                        ఇల్లాలు గొప్పతనం తన ఇల్లుని చూస్తే సరిపోతుంది అన్నారు మన పెద్దలు .అలాగే మన ఊరిని చూస్తె మన ఊరిలో ఉన్న ప్రజల గొప్పతనం తెలుస్తుంది .మనం మన ఊరిని ఇలాంటి హీన స్తితిలో చూస్తూ అలాగే ఉంటే మనం సంపాదించుకున్న గొప్పతనం మన ఒక్క ఇంటికే మాత్రమే ఉంటుంది. నా ఊరే నా ఇల్లు .మా ఊరంతా ఒక ఉమ్మడి కుటుంబం అనే నినాదంతో మన మంత ఒక్కటై మన ఊరి అభివృద్ధి కోసం కలసి కట్టుగా  అందరి మేధాలోచనలతో ముందుకు  పయనిస్తూ మన ఊరి (దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ) గొప్పతనం తెలియ జేసి అందరికి స్ఫూర్తి దాయకం అవుదాం .అందరిని చైతన్యం కలిగిద్దాం .
                                   మనమంతా ఒకటిగా ఉండి మన ఊరి పేరు మీద ఒక చారిటి ట్రస్ట్ తయారు చేసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మనమంతా కలసి కొంత నిధిని ట్రస్ట్ పేరు మీద జమ చేసుకొని ,మన ఊరి ప్రజలతో కలసి వాళ్ళ ఆలోచనలను ,అవసరాలను పరిగణలోకి తీసుకొని మన ఊరి గ్రామ కమిటి సహాయంతో   ప్రభుత్వ పథకాలను, మన స్వచ్చంద పధకాలను అమలు చేసుకొని మన ఊరిని అభివృద్ధి చేసుకుందాం అని చాల మంది (మన ఊరి నుంచి దూర ప్రాంతాలలో ఉద్యోగులుగా,వ్యాపారస్తులుగా స్తిరపడిన మరియు అభివృద్ధి చెందిన మిత్రులు  ,గౌరవనీయులు ) తో మాట్లాడటం జరిగింది .కొంతమంది వాళ్ళ అత్యవసర ,ముఖ్యమైన ఉద్యోగ ,వ్యాపార పనుల వల్ల  కలవలేక పోయారు .అందరు కూడా చాల సంతోషంగా ముందుకు రావటానికి సిద్ధమైనారు . 20.04.2014 మరియు 07.05.2014తేదినాడు 20 మందితో మన ఊరిలో ఒక మీటింగు జరిపినాము .మన ఊరి చారిటి ట్రస్ట్ లో సభ్యునిగా చేరటానికి ప్రవేశ రుసుం కింద 1000 రూపాయలుగా నిర్ణయిన్చటమైనది .ఈ ట్రస్ట్ పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళే వాళ్ళను కమిటి సభ్యులుగా ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాము. నేను సైతం అంటూ ముందు వచ్చి మన ఊరి ని అభివృద్ధి చేసి యావత్ ప్రపంచానికే స్ఫూర్తి దాయకం చేస్తారని ఆచిస్తున్నాం . అందరి ఆలోచనలతో ఈ క్రింది వాటికి  ప్రాధాన్యం ఇవ్వటమైనది . ప్రతి ఒక్కరి ఉన్నతమైన ఆలోచనలని పరిగణలోకి తీసుకుందాం . మన ఊరి చారిటి ట్రస్ట్ యొక్క ముఖ్యమైన లక్ష్యాలు .
1) ప్రతి ఒక్కరికి ఉన్నత విద్య పట్ల అవగాహన కలిపించటం.
2) మంచి నీరు సదుపాయం కలిపించటం
3) అన్నివాతావరణాల్లో వాడుకొనేలా వీధి రహదారుల(సిమెంట్ రోడ్లుఏర్పాటు
4) గ్రంధాలయం నిర్మాణం
5) దేవుడి ఆలయాల (గ్రామ బొడ్డు రాయి ) పునఃనిర్మానం
6) నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలలో మన ప్రాధాన్యతతో ప్రవేశాలు (recommendations) కలిపించటం
7) ఊరి కట్టుబాట్లను గౌరవించటం మరియు పాటించటం ,మన ఊరిని పరిశుబ్రతంగా ఉంచుకోవటం 
8) మన ఆరోగ్యం కోసం తగిన జాగ్రతలు తీసుకోవటం
9) ఆదాయం పెంచుకోవటానికి ఉపాధి అవకాశాలను వినియోగించుకోవటం .
10) ప్రతి పనిలోనూ( వ్యవసాయం / చేతి వృత్తులు ) నాణ్యతను పెంచుకోవటం కోసం ఉన్నతాధికారులతో సలహాలు తీలుకోవటం.
11) మన ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు అమ్ముకునే విధంగా , మార్కెట్ యార్డ్ ని నిర్మించుకోవటం .
12) అందరిపట్ల సత్సంబ్భందాలు కలిగి వుండటం, పిల్లల పట్ల అభినందన మరియు పెద్దల పట్ల గౌరవ భావం కలిగి ఉండటం  .
13) గ్రామ ఆదాయం పెంచటానికి లాభసాటి ఉత్పత్తులను (టేకు చెట్లు , తేనే ) తయారు చేసుకోవటం ,ఆధునిక పద్ధతిలో గ్రామ పొలం లో వాణిజ్య పంటలు పండించుకోవటం 
14) ఊరి సంస్కృతి ,సంప్రదాయాల ఉత్సవాలను గౌరవంగా జరుపుకోవటం
15)  చెట్లు నాటడం
16)  సంప్రదాయిక నీటి సంస్థల పునరుద్ధరణ (కుంటలు ,చెరువుల ఒండ్రును తొలగించడంతో సహా)
17) ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకోవటం
18) పిల్లలలో విద్య ,నాయకత్వ ,సమాజ సేవ లక్షణాలను గుర్తించి ఫ్రోహ్త్సహించటం
19) ప్రతి సంవత్సరం కొన్ని ముఖ్యమైన పండుగలకు(సంక్రాంతి ,శ్రీరామ నవమి ,ఆగష్టు15 ,దసరా,... )  చారిటి ట్రస్ట్ సభ్యులంతా కలసి మన ఊరి ప్రజలతో మనమంతా ఆత్మీయతను పంచుకోవటం .
20) ప్రకృతి వైపరీతాలలో మన ఊరి చారటి ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సహాయం చేయటం.
20.04.2014 మరియు 07.05.2014 తేది నాడు భట్టువారిపల్లెలో సమావేశానికి హాజరైన సభ్యుల వివరాలు .
1) గాదె శివరామ కృష్ణ S/O నరసింహారావు మాస్టర్ గారు ,2) కోరముట్ల లక్ష్మి నారాయణ S/O అంకయ్య గారు ,3) సొంగ సైదులు S/O వెంకయ్య గారు,4) పులిమి బాల సైదులు S/O పెద్ద సైదులు గారు,5) పిల్లల వెంకట్రామయ్య S/O సోమయ్య గారు ,6) నీలం మంగారావు S/O రామకృష్ణ గారు ,7) కూరపాటి రామ రాజు S/O సైదం రాజు డాక్టర్ గారు ,8) ఆతుకూరి శ్రీనివాసరావు S/O పెద్ద సైదులు గారు ,9) ఆతుకూరి నాగేశ్వరరావు S/ఓ చిన సైదులు గారు,10) పయ్యావుల శ్రీనివాసులు రావ్ S/O అప్పయ్య గారు,11) నీలం అశోక్ S/O గోవిందు గారు ,12) నీలం వేణు గోపాల రావు S/O గోవిందు గారు ,13) కోరముట్ల పూర్ణ చందర్ రావు S/O చిన అంకయ్య గారు ,14) కోరముట్ల శివ నాగేశ్వరరావు S/O చిన అంకయ్య గారు ,15) నలమార అరుణ్ బాబు S/O అనత లక్ష్మయ్య  గారు ,16) నూకన సైదయ్య S/O రామయ్య గారు ,17) వెలిశెట్టి శ్రీనివాస రావు S/O సత్యనారాయణ గారు ,18) పయ్యావుల సతీష్ S/O ఈశ్వరయ్య గారు ,19) ప్రత్తి శ్రీనివాస రావు S/O  మల్లయ్య గారు ,20)  మేడతి ప్రదీప్( బజార్ )  S/O  సైదులు గారు ,21) లింగాల వెంకట్ S/O  బక్కయ్య గారు ,22) గాదె వెంకటేశ్వర్లు S/O  ఆంజనేయులు గారు,23) రావుల నరసింహ రావు S/O  కృష్ణ గారు ,24) సరికొండ సుందర్ రాజు గారు S/O పండరి రాజు గారు,25) తంగిల్ల వెంకటేశ్వర రాజు S/O  బాలరామ రాజు గారు ,26) గెనిపిశెట్టి సుబ్బా రావు S/O సుబ్బయ్య  గారు ,27) ఆది శ్రీనివాస రావు S/O సుబ్బయ్య  గారు,28) బండారు దివ్య గిరి S/O వెంకయ్య  గారు.
మీ అభిప్రాయలు / విమర్శలు/ సలహాలు  తెలియజేసి ఉన్నతమైన వ్యవస్తను నిర్మిస్తారని ఆచిస్తూ
ఇట్లు మీ పయ్యావుల శ్రీనివాసులు రావు , Phone Number : 9849848586


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • Twitter
  • RSS

0 Response to "OUR ACTIVITIES & GOALS..."

Post a Comment